Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

by CVR NEWS
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్లేందుకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.26,600 కోట్లు విద్యాశాఖకు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏర్పడలేదని, 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిందని అన్నారు.నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించామని, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీతో విద్యా ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు. తొలిసారిగా నర్సరీ నుంచి అడ్మిషన్లు కల్పించామని, ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలో సీట్లు పూర్తయినా అదనంగా 1,500 దరఖాస్తులు రావడం ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026797
Total views : 151104

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.