ఈ రోజు మందమరి మంజునాథ్ గార్డెన్ లోజరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు జిల్లా పరిషత్తు చేర్మన్ నల్లల భాగ్య లక్ష్మి మందమర్రి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాయలింగు ఉపులేటి నరేష్, మరియు సఖి లయన్స్ క్లబ్ మహిళ నాయకురాలు శాంకరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు, ముఖ్యంగా స్త్రీని గౌరవించు, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు, ఎక్కడ స్త్రీలు గౌర వించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనను ఫలించవు అని మన సంస్కృతి తెలుపుతుంది. కనుక నేటి సమాజంలో మహిళల పట్ల వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు.
అలాగే ఉద్యోగుల గా భార్యా పిల్లలకె కాకుండా చుట్టుపక్కల మన గ్రామాల మహిళలు పని కి వెళ్తారు అన్నారు. 24 మంది అన్నిరంగాల మహిళలను సత్కరించటం సన్మానించి అవార్డు అందజేశారు ప్రోత్సహించడంలోమందమర్రి అంబేద్కర్ యువజన సంఘం, సఖి లయన్ క్లబ్ మంచిర్యాల ఎప్పుడు ముందుంటుందని ఉపులేటి నరేశ్ అన్నారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించుకున్న వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు మెమోంటో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు పాల్గొన్నారు.