Israel-Hamas : ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన…
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధానికి ఈ రోజుతో ఆరు నెలల కాలం పూర్తైంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడికి ఇజ్రాయెల్ ప్రతీ దాడులు చేస్తూ.. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో పాలస్తీనీయుల ఆర్తనాధాలు.. యావత్ ప్రపంచాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. గాజా ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. ‘ఆపరేషన్ అల్-అక్సా స్ట్రామ్’ (Operation Al-Aqsa Storm) పేరిట గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు.
బందీల విడుదలే లక్ష్యంగా దాడులు…
ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. హమాస్ అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రతి దాడుల కారణంగా ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు.. దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి : రాజమండ్రి షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి