గత ఆరు నెలల క్రితం ఓ మహిళ భద్రాచలం పట్టణంలోని జీవన్ ఆసుపత్రిలో డెలివరీ కావడం ఆడ శిశువు జన్మించడం జరిగింది అక్కడి వైద్యురాలు ఆ శిశువు మృతి చెందిందని ప్రసవించిన ఆ యువతితో చెప్పి కొత్తగూడెంకు చెందిన వారికి ఆ శిశువును విక్రయించిందని వివిధ కథనాలు ప్రచురితమయ్యాయి.
ఆ తర్వాత శిశు సంక్షేమాధికారులు అక్రమంగా దత్తత జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు శిశువును చట్ట విరుద్ధంగా దత్తత పొందిన తల్లిదండ్రుల నుంచి శిశువును స్వాధీనపరచుకొని మధ్యాహ్నం భద్రాచలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా విచారణ పూర్తయిన అనంతరం మీడియా సమక్షంలో అప్పగిస్తామని వెల్లడించిన భద్రాచలం పోలీసులు. నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా భద్రాచలంలోని శిశు గృహకు శిశువును అప్పగించారు. ఈ వివాదంలో మొదటినుండి అధికారుల విచారణ తీరుపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్న క్రమంలో అసలు అప్పుడు విక్రయించిన శిశువు ఉందా లేదా ఆస్థానంలో మరే ఇతర శిశువును చేర్చారా…? లేకపోతే శిశువును ఇంత రహస్యంగా శిశుగృహకు తరలించడంలో ఆంతర్యం ఏమిటి….? అనే కోణాల్లో అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి.
మీడియా తో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ ఈ అక్రమ దత్తత కార్యక్రమం పట్టణంలోని జీవన్ హాస్పటల్లో జరిగిందని అందువల్లనే ఈ కేసులో హాస్పిటల్ డాక్టర్ స్పందనను A1 గా చేర్చడం జరిగిందని మధ్యవర్తిత్వం జరిపిన గోపి నందన్ అనే వ్యక్తిని A2గా చేర్చామని దత్తత స్వీకరించిన దంపతులైనటువంటి ప్రవీణ్ పల్లవి అనే వ్యక్తులను A3, A4 గా పోలీసులు వెల్లడించారు.
నిరుపేద మహిళ అయినటువంటి శిశువు తల్లి ప్రలోభాలకు లోనైనట్లుగా తెలుస్తుంది. ప్రసవానంతరం శిశు మరణించిందని అంగన్వాడి కేంద్రంలో నమోదు చేయడం జరిగింది తర్వాత శిశు సంక్షేమ అధికారుల విచారణలో మాత్రం అంత హాస్పిటల్లోనే జరిగిందని హాస్పిటల్ డాక్టర్ పట్టణంలోని న్యాయవాది చెప్పినట్లుగా ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టినట్లుగా అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసులవిచారణలో మాత్రం ఎక్కడ న్యాయవాది ప్రస్తావన లేకపోవడం విశేషం. అంతేకాకుండా ఈ శిశువుకు జనన ధ్రువీకరణ పత్రాన్ని సైతం సృష్టించినట్లుగా తెలుస్తుంది. అధికారుల ప్రవర్తన సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఇకనైనా ఈ కేసులో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారించి దోషులను శిక్షించవలసిందిగా కోరుతున్నారు.
భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో పురిటి శిశువును విక్రయించిన వైద్యురాలు…
110
previous post