మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు బాధలు అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ మణిపూర్ను సందర్శించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆయనను క్షమించబోరని తెలిపారు. మణిపూర్ను కాల్చివేయాలని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.
ఈ నెల 7 నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీకి చేరుకున్న లగచర్ల ఫార్మా లడాయి …ఢిల్లీకి చేరుకున్న లగచర్ల ఫార్మా లడాయి … లగచర్ల ఫార్మా పరిశ్రమ బాధిత కుటుంబాలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్…
- మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలంహైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేపుతున్నాయి. ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్నగర్,…
- జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్…ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి…
- అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలుప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో .. అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా…
- మణిపూర్ పై కాషాయపార్టీ కుట్రమణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి