90
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న కు చెబుదాం కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆర్డీవో సాయిబాబా పాల్గొన్నారు. మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పలువురు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అర్జీలు ఆన్లైన్ చేసి రసీదు ఇచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్తున్నారు. నందిగామ మండలం పెద్దవరం రైతులు కంచికచర్ల మండలంలో కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న జాయింట్ కలెక్టర్.