ఏపీలో మధ్యాహ్న భోజన పథకంపై విద్యాశాఖ కీలక నిర్ణయం..

ఏపీలో మధ్యాహ్న భోజన పథకంపై విద్యాశాఖ కీలక నిర్ణయం

Advertisements

<p>ఏపీలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో ఎంవోయూ కుదిరింది&period;డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ&comma; ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు&period; ఇందులో భాగంగా వారానికి మూడు సార్లు రాగిజావను అందిస్తూ&comma; పిల్లల్లో పోషకాహార స్థాయిలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు&period;రాగిజావలో 10 గ్రాముల రాగిపిండి&comma; 10 గ్రాముల బెల్లం పొడి కలిపి 150 మిల్లీలీటర్ల వేడి నీటిలో తయారు చేసి విద్యార్థులకు ఇస్తున్నారు&period; ఇది కాల్షియం&comma; ఐరన్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period;ఈ కార్యక్రమానికి అవసరమైన రాగిపిండి&comma; బెల్లం పొడిని ట్రస్ట్ ఉచితంగా అందిస్తుండగా&period;&period; జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలలకు సరఫరా వ్యవస్థను ప్రభుత్వం నిర్వహిస్తోంది&period; మొత్తం మూడు సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు&period;ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1&comma;850 కోట్లను ఖర్చు చేస్తూ&period;&period;విద్యార్థుల హాజరు&comma; నమోదు పెంపు&comma; డ్రాప్ అవుట్ తగ్గింపు లక్ష్యంగా పనిచేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.