నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది. దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
ఈ నెల 24 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర
70
previous post