నేటితో నెరవేరిన రాయచోటి ప్రజల చిరకాల కోరిక….

Inauguration of Hundred Bed Hospital

Advertisements

&NewLine;<p>వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ వంద పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం&comma; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్ అన్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం&comma; ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంభించారు&period; ముఖ్య అతిథులుగా హాజరైన వారికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు&period; అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష&comma; ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; అన్నమయ్య జిల్లా డి ఎం హెచ్వో కొండయ్య&comma; ప్రాంతీయ వైద్యశాల సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్&comma; ప్రముఖ సీనియర్ వైద్యులు బయా రెడ్డి&comma; నారాయణ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు&comma; వైకాప నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు&period; అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు&comma; మేళ తాళాల నడుమ పూర్ణ కుంభం తో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు&period; ఆసుపత్రి లో వివధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు&period; అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దినం చాల చారిత్రాత్మక దినం అన్నారు&period; వందపడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రావడంతో రాయచోటి ప్రజల చిరకాల కోరిక నేటితో నేరవేరిందన్నారు&period; ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాయచోటిలో పర్యటించినప్పుడు వందపడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకు స్థాపన చేశారన్నారు&period; అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్ ల సహకారంతో త్వరిత గతిన నిర్మాణాలను పూర్తీ చేసుకొని ఈ రోజు అందుబాటులోకి తెచ్చామన్నారు&period; త్వరలోనే సిటి స్కాన్&comma; 8 బెడ్లు ఉన్న డయాలసిస్ ను 20 బెడ్లకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..