మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.

Advertisements

<p>మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది&period; హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4&period;7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది&period; ఉదయం సుమారు 8&colon;45 గంటల సమయంలో భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు&period; భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు&period; హింగోలితో పాటు పొరుగున ఉన్న నాందేడ్&comma; పర్భానీ&comma; వాషిమ్&comma; ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కూడా భూకంప ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి&period; నాందేడ్ నగరంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని&comma; ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయని స్థానికులు తెలిపారు&period; అ ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు ధ్రువీకరించారు&period; గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో 4&period;5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&comma; పాత భవనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.