రామేశ్వరం(Rameswaram) కేఫ్ పేలుడు కేసు..
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించింది జాతీయ దర్యాప్తు సంస్థ. నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ గా గుర్తించింది. అనుమానితుడు కర్ణాటక(Karnataka)లోని తీర్ధహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన వాడిగా తెలిపింది. షాజిబ్ కు ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. కేసు దర్యాప్తులో భాగంగా పరిసరాల్లోని వెయ్యి కంటే ఎక్కువ సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు ధరించిన క్యాప్ ని సీసీటీవీ వీడియోలో గుర్తించిన తర్వాత ఎన్ఐఏ ఈ విషయాలు తెలిపారు. ఈ క్యాప్ ని చెన్నై మాల్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈఏడాది జనవరిలో చెన్నైలో ఉన్నట్లు.. నెల రోజులకు పైగా చెన్నైలో ఉన్నట్లు తెలిపారు. షాజిబ్ సహచరుల్లో ఒకరైన అబ్దుల్ మతీన్(Abdul Mateen) తాహాని కూడా గుర్తించింది యాంటీ టెర్రర్ ఏజెన్సీ. తాహా కూడా తీర్థహళ్లికి చెందిన వాడిగా గుర్తించారు. తమిళనాడు పోలీస్ ఇన్ స్పెక్టర్ కె విల్సన్ హత్య కేసులో తాహాకు సంబంధం ఉందన్నారు అధికారు. షాజిబ్ తో పాటు తాహా చెన్నైలో ఉన్నట్లు తెలిపారు. తాహాకు కూడా ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పేలుడుకు ఒకరోజు ముందు కేఫ్ లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు.
ఇది చదవండి: భూటాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి