హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు రోజు కావడంతో సాయంకాలం చాలామంది నగరవాసులు బయటకు వచ్చారు. ఈ సమయంలో వర్షం కురవడంతో తడిసిముద్దయ్యారు. హైదరాబాద్‌లో ఈరోజు మరో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగర పరిధిలో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం. ఈరోజు సాయంత్రం అత్యధికంగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతంలో సుమారు 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దోమలగూడ, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, షాపూర్ నగర్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మలక్ పేట, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి