జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం పులికల్ గ్రామంలోని దళిత వాడలో వారం రోజుల నుంచి కరెంటు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దళిత వాడలో వారం రోజులుగా కరెంట్ లేదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు తను చెప్పినట్లుగా కేటీఆర్ గారు.. ఫర్ యూవర్ ఇన్ఫర్మేషన్ అంటూ టీజీఎస్పీడిసీఎల్ రిజైండర్ ప్రకటనను పోస్ట్ చేశారు. కరెంట్ విషయంలో ఏదైతే ప్రచారం జరుగుతోందో అది తప్పు అని వెల్లడించారు.దళితవాడల్లో కరెంట్ లేదని కేటీఆర్ ట్వీట్. దీన్ని రీట్వీట్ చేయడం ద్వారా మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి పోస్ట్‌లను షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ధృవీకరించడం ముఖ్యమని సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి