కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు. సంజయ్‌మూర్తి 24 డిసెంబర్ 1964లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు.
ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుంచి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్‌గా నియమించింది. గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గిరీశ్చంద్ర ముర్ము పదవీకాలం త్వరలో ముగియనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అయ్యప్ప దర్శనానికి 10 గంటలుశబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ…
- కాగ్ చీఫ్ గా తెలుగు ఐఏఎస్ కె.సంజయ్ మూర్తికంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి…
- రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాందేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో…
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇక జైలు కేనా ..?ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావు…
- ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లురాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి