91
శ్రీశైలం అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ పక్కన ఉన్న చెక్ డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెక్ డ్యామ్ లో నీటిపై తెలియాడుతున్న మృతదేహాన్ని బహిర్భకి వెళ్లిన స్థానికులు కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు చేరుకొని మృతదేహాన్ని చెక్ డ్యామ్ నుండి పోలీసులు బయటకు తీశారు. అయితే గుర్తు తెలియని మృతదేహనికి సంబంధించి వివరాలు ప్రకారం శ్రీశైలానికి చెందిన వెంకట్ నారాయణ కుమారుడు నాగరాజు గా గుర్తింపు. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయి చివరికి మిగతాజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు పర్యాంతరమయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.