87
అన్నమయ్య జిల్లా…
రాయచోటి మండలం చేన్నముక్క పల్లి గ్రామం లో రాజుల కాలనికి చెందిన తలారి రమణ (53) అనుమానాస్పదంగా మృతి చెందారు.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం తలారి రమణ కు మొదటి భార్య మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.సుమారు 15 ఏండ్ల క్రితం సుగుణ అనే మహిళతో రెండవ వివాహం చేసుకొన్నారు. ఆమెకు ఒక పాప కూడా ఉంది.ఈ రోజు మధ్యాహ్నం ఆమె కడపకు వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రమణ ఉరివేసుకొని మృతి చెందినట్లు వారు తెలిపారు.మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.రమణ మృతికి కుటుంబ సమస్యల లేక ఆర్థిక సమస్యల,ఇతర సమస్యల అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..