జనసేన(Janasena)లోకి టీడీపీ నేత..
ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్(Deputy Speaker), టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్(Mandali Buddhaprasad) నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది.
ఇది చదవండి: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!
1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బుద్ధ ప్రసాద్ కు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి