85
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ జవాన్ ను మావోయిస్టులు హత్య చేశారు. హత్య చేసిన అనంతరం జవాన్ మృతదేహాన్ని గోర్నా రోడ్డుపై మావోయిస్టులు పడేశారు. అయితే నిన్న రాత్రి జవాన్ కుర్సామ్ ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారని సమాచారం. అయితే నిన్న కూడా ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కాగా సీఆర్పీఎఫ్ పోలీసులు సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Read Also..
Read Also..