69
పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లోని చర్ల మండలం అంజనీపురం దారిలో భద్రతా బలగాలు పోలీస్ జాగిలాలతో రూట్ మార్చ్ జరిపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును పోలీస్ జాగిలాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తం అయిన బలగాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి దానిని నిర్వీర్యం చేయించారు. ఈ ఘటన అనంతరం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత చర్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న రాజకీయ నాయకులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ బయటికు పంపించారు. అనంతరం ఆయన అక్కడ భద్రతను పర్యవేక్షించారు.