56
బీఎస్పి జాతీయ అధ్యక్షురాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి పెద్దపల్లి లో జరిగే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న సభాస్థలిని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష మరియు జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. రేపు గురువారం రోజు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.