56
జలగం వెంగళరావు పార్క్ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి…అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే తో కలిసి వెంగళరావు పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు. టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలని, అదే విధంగా పార్క్ ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్కులో ఉన్న చెరువు నీటిని శుభ్రం చేసి , దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎంటామాలోజి డాక్టర్ రాంబాబును ఆదేశించారు. వాకర్స్ కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించాలని సూచించారు. యోగ, మెడిటేషన్ సెంటర్ ను 27వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను.. మేయర్ ఆదేశించారు.