గద్వాల రాఘవేంద్ర కాలనీలో కాలుష్య కల్లోలం..

గద్వాల రాఘవేంద్ర కాలనీలో కాలుష్య కల్లోలం

Advertisements

<p>జోగులాంబ గద్వాల జిల్లా రాఘవేంద్ర కాలనీలో ప్రజల జీవితం నెమ్మదిగా కష్టాల్లోకి జారిపోతోంది&period; ఇళ్ల మధ్యలో నడుస్తున్న చిన్న ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ ఇప్పుడు వారి ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తోంది&period; రోజూ శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; చిన్నపిల్లలు ఆడుకోవాల్సిన వయసులోనే దగ్గు&comma; ఆయాసంతో బాధపడుతుంటే&comma; వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు&period; ఆస్తమా&comma; సైనస్ వంటి సమస్యలు ప్రతి ఇంటిలో వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది&period; పలుమార్లు మున్సిపల్ అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడం ప్రజల్లో నిరాశను మరింత పెంచింది&period; ఆరోగ్యంగా జీవించాల్సిన హక్కు కోల్పోతున్నామనే బాధతో వారు ఇప్పుడు మీడియా ద్వారానే తమ గోడును బయటపెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కాలుష్యం ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే కాకుండా జీవనోపాధిపై కూడా తీవ్రంగా పడుతోంది&period; రాఘవేంద్ర కాలనీలో నివసించే చేనేత కార్మికులు తమ మగ్గాలపై కష్టపడి నేసిన చీరలు&comma; ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ కారణంగా నాశనమవుతున్నాయని వాపోతున్నారు&period; పొగలోని వ్యర్థ పదార్థాలు చీరలపై పడుతూ వాటి నాణ్యతను తగ్గిస్తున్నాయి&period; ఒక చీర పాడైతే ఒక రోజు సంపాదన కోల్పోయినట్టే&period; ఇలా ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతూ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; తమ పిల్లల భవిష్యత్తు&comma; తమ జీవనోపాధి రెండూ ప్రమాదంలో ఉన్నాయని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు&period; ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో&comma; ఇప్పుడు అయినా అధికారులు స్పందించి ఈ సమస్యకు ముగింపు పలకాలని కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>మహబూబ్‌నగర్‌ మణికంఠ ఫోన్‌ ఇన్‌<br &sol;>&NewLine;దీనిపై మా ప్రతినిధి మణికంఠ మరిన్ని విషయాలు అందిస్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..