2026 జూన్ 1నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్..

2026 జూన్ 1నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్

Advertisements

<p>విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది&period; కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తూ 2026 జూన్‌ 1 నుంచి సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రారంభమవుతుందని ప్రకటించింది&period; ఈ జోన్‌ పరిధిలో గుంతకల్లు&comma; గుంటూరు&comma; విజయవాడ డివిజన్లను చేర్చింది&period; 2019 ఫిబ్రవరిలో ఈ జోన్‌ ఏర్పాటు ప్రకటన వెలువడినప్పటికీ&period;&period; అనేక కారణాలతో ఆలస్యమైంది&period; అనంతరం 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం లభించగా&period;&period; అదే నెలలో జోనల్‌ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు&period; తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభానికి మార్గం సుగమమైంది&period;<&sol;p>&NewLine;<p>జోన్‌ కార్యకలాపాల కోసం కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది&period; ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌&comma; ఎలక్ట్రికల్‌&comma; ఇంజినీరింగ్‌&comma; పర్సనల్‌&comma; ఫైనాన్స్ విభాగాల్లో ఉన్నతాధికారులను నియమించారు&period; ఇతర డివిజన్ల నుంచి సిబ్బంది ఆప్షన్లు కోరగా&period;&period; సుమారు 3 వేల మంది విశాఖ జీఎం కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపారు&period; జీఎం కార్యాలయానికి దాదాపు 1200 మంది అవసరమవుతుండగా&period;&period; మొత్తం జోన్‌ పరిధిలో సుమారు 17 వేల మంది సిబ్బంది పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..