94
బీర పాదు ఆకులు మెత్తగా నూరి, రసం తీసి కళ్లలో వేస్తే కళ్ల మంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతుంది. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. బీరకాయ అరుచిని కూడా పొగొడుతుంది. లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది. కలువ గింజలకు చలువ చేసే గుణం వుంది. వీటిని పచ్చివిగా కానీ, కూరగా కాని చేసకుని తీసుకోవచ్చు. నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల ఫలితం వుంటుంది. అదే విధంగా పుదీనా ఆకులు, ఉప్పు కలిపి, నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది.