నరసాపురంలో మెగా జాబ్ మేళా..

Mega Job Mela

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరు అయ్యారు&period; ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్రా&comma; ఎన్&period; ఐ&period; ఐ టి&comma; యాక్సిస్ బ్యాంకు&comma; జీయో&comma; బి&period; డి&period;ఏమ్&period;ఎస్ బ్యాంక్&comma; వంటి 60 ప్రముఖ కంపెనీలో సుమారు 5000 ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు&period; జిల్లాలో మొట్టమొదటి ఆఫ్లైన్ అతిపెద్ద జాబ్ మేళా ఇదేనని ఈ జాబ్ మేళాకు పశ్చిమగోదావరి జిల్లా తో పాటు బెంగళూరు&comma; హైదరాబాద్&comma; వైజాగ్&comma; చెన్నై వంటి ప్రముఖ నగరాల నుండి అనేకమంది నిరుద్యోగులు హాజరయ్యారని ఆయన తెలిపారు&period; అనేకమంది యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపాధి కల్పించేందుకు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు&period; ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు&comma; ప్రముఖ వైద్యులు డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ ముఖ్యఅతిధులుగా పాల్గొని మాట్లాడారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో ఈ మెగా జాబ్ మేళా చూస్తే అర్థమవుతుందని వేలాదిమంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు&period; నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు అభినందనీయుడని అన్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;revanth-reddy-will-introduce-the-otan-account-budget&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..