75
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..