గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..

Advertisements

<p>2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి&comma; విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు&period; ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు &period; ఈ వేదిక ద్వారా తెలంగాణలోని వ్యాపారులు&comma; ఎగుమతిదారులు&comma; విద్యార్థులు&comma; స్టార్టప్‌లు&comma; నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించి ప్రపంచ స్థాయిలో విస్తరించే అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు&period; ముఖ్యంగా ఎగుమతిదారులు&comma; విద్యార్థులపై దృష్టి పెట్టి ప్రపంచ మార్కెట్లలో ప్రవేశం కల్పించేందుకు పలు దేశాల్లో ఎక్స్‌ప్లోరేటరీ మిషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు&period; రాష్ట్రం ప్రస్తుతం సుమారు 19 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగుమతులు సాధిస్తూ దేశంలో ప్రముఖంగా ఎదుగుతున్నదని తెలిపారు&period; ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల వృద్ధి&comma; పెట్టుబడుల ఆకర్షణ&comma; ఆర్థికాభివృద్ధి దిశగా ఈ2ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు తెలిపారు&period; ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వ్యాపారవేత్తలకు&comma; ఎగుమతిదారులకు&comma; యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని తెలిపారు&period; తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా నిలబెట్టడానికి కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు&period; వ్యాపారులు&comma; ఎగుమతిదారులు&comma; విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్తున్నవారిని మంత్రి అభినందించారు&period; మొదటి అంతర్జాతీయ మిషన్ సింగపూర్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..