70
విజయవాడ తాడేపల్లి లోని మణిపాల్ హాస్పిటల్ లో చేరిన మంత్రి వేణుగోపాల్ కృష్ణ. ఈ మద్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి. వాంతులు కావడం తో ఆసుపత్రికి వెళ్లిన మంత్రి వేణు. ఈ మధ్య కాలంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న మంత్రి. గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించిన వైద్యులు. డాక్టర్ల సూచనలతో మణిపాల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మంత్రి. రేపు ఉదయం వైద్య పరీక్షలకు ఏర్పాట్లు. మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసిన ఆయన కార్యాలయ వర్గాలు.