కాసేపట్లో తీహార్ జైలు నుంచి కోర్టుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) హాజరుకానున్నారు. ఈ ఉదయం 10:30కు కోర్టు ముందు సీబీఐ(CBI) ప్రవేశపెట్టనుంది. సీబీఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఇటీవల జరిపిన సీబీఐ విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్ట్ చేసినట్లు సమాచారం. సీబిఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కవిత ఇవ్వలేదని, లిక్కర్ స్కాం(Liquor Scam)లో కేజ్రివాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపణలు. దాంతో నేరుగా కస్టడీలోకి తీసుకొని సీబీఐ ప్రశ్నించనుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది.
ఇది చదవండి: కవిత ఎమోషనల్… బాధతో జడ్జికి లేఖ
సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంది. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.