భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి……..

Advertisements

<p>భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి&period; ఈ విపరీత వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు&period; దేశ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని ప్రశ్నిస్తూ ఆమె సంచలన డిమాండ్ చేశారు&period; ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ&period;&period; భారత్-పాక్ మధ్య మళ్లీ యుద్ధం జరిగితే&comma; మా మొదటి టార్గెట్ కోల్‌కతానే అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు&period; ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా&comma; కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గట్టి కౌంటర్ రాకపోవడంపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఓ బహిరంగ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు&period; పాక్ మంత్రి ఇంతటి సాహసానికి ఒడిగడితే&period;&period; ప్రధాని మోదీ గానీ&comma; రక్షణ శాఖ మంత్రి గానీ ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు&period; దేశ సమగ్రతపై దాడి జరుగుతుంటే కేంద్రం మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు&period; కేవలం ఎన్నికల సమయంలోనే మోదీకి పశ్చిమ బెంగాల్ ప్రజలు గుర్తుకొస్తారా&quest; అంటూ ఫైర్ అయ్యారు&period; ఓట్ల కోసం వస్తారు కానీ&comma; పొరుగు దేశం బెంగాల్ ను టార్గెట్ చేస్తామంటే ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు&period; దేశ సరిహద్దులను&comma; ప్రజల ప్రాణాలను కాపాడలేనప్పుడు ప్రధాని ఆ పదవిలో ఉండే అర్హత లేదని&comma; మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు&period; బెంగాల్ ఆత్మగౌరవాన్ని&comma; భద్రతను తాము ప్రాణాలకు తెగించి కాపాడుకుంటామని&comma; కానీ కేంద్రం బాధ్యతారాహిత్యం దేశానికే ప్రమాదకరమని మమత పేర్కొన్నారు&period; పాకిస్థాన్ తోకముడిచేలా కేంద్రం నుంచి కఠినమైన హెచ్చరికలు రావాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు&period; ప్రస్తుతం దీదీ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..