మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం…

Incharge Mohammad Nazir media conference

Advertisements

&NewLine;<p>గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులను చూసాం&period; రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి అశేష ప్రజానికం విజయనగరం వైపు రావడంతో జన సముద్రం గా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని మహమ్మద్ నసీర్ తెలిపారు&period; తెలుగుదేశం వీర సైనికులు&comma; జనసేన జన సైనికులు కదిలి వచ్చారని అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్&comma; నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు&period; యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు చేపట్టినటువంటి దాదాపు 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాలను ఆయన సందర్శించారు&period; ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన అన్నారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్ధంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారని వివరించినటువంటి తీరు అద్భుతం అన్నారు&period; సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులకు&comma; జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు&period; మంత్రి రోజా పవిత్రమైనటువంటి గుడిలో లోకేష్ గారి మీద వ్యంగంగా మాట్లాడడం సరికాదన్నారు&period; రోజా గారికి రోజులు దగ్గరపడ్డాయి ఆమె మంత్రిగా ప్రజలకు ఏం సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలని అన్నారు&period; అలాగే వెల్లంపల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు&period; ఈరోజు లోకేష్&comma; పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తోందో ప్రజలందరూ ఆలోచించాలని&comma; పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని తెలిపారు&period; ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ&comma; జనసేన పార్టీ&comma; జనసేన సైనికులు గాని మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.