కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ తన కుమారుడితో హైదరాబాద్ నుంచి బయలుదేరి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చారు…

Advertisements

<p>కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన మహిళ తన కుమారుడితో హైదరాబాద్ నుంచి బయలుదేరి సామర్లకోట రైల్వే స్టేషన్ కు వచ్చారు&period; అయితే ఆమె సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి వారి స్వగ్రామం జగ్గంపేటకు ఆటోలో బయలుదేరి గమ్యస్థానమైన జగ్గంపేట చేరుకున్నారు&period; అయితే ఇదిలా ఉండగా వారు ఆటో దిగి కొంత దూరం వచ్చిన తర్వాత ఆటోలో వారి యొక్క బ్యాగు మర్చిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు&period; ఆ బ్యాగ్ లో దుస్తులతో పాటు సుమారు నాలుగు లక్షల 50 వేలు విలువగల 34 గ్రాములు బంగారు వస్తువులు ఉండడంతో ఆమె జగ్గంపేట పోలీసులను ఆశ్రయించారు&period; దీనిపై తక్షణం స్పందించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆటో ఆచూకీ కోసం రంగంలోకి దిగారు&period; జగ్గంపేట పోలీస్ స్టేషన్ లోని సిసి ఫుటేజ్&comma;ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీసీ కెమెరాలు&comma;దేవి సెంటర్లోని సీసీ కెమెరాలు&comma; కాకినాడ రోడ్ లోని కాట్రావులపల్లి గ్రామంలో ఉన్న ప్రధాన సీసీ కెమెరాల ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించి&comma;సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటోను గుర్తించారు&period;<br &sol;>&NewLine;కేవలం మూడు గంటల వ్యవధిలో కేసును చేదించి&comma; ఆటోలో ఉన్నటువంటి ఆ బ్యాగును&comma;బ్యాగ్ లోని విలువైన బంగారం వస్తువులను ఆ యొక్క మహిళకు జగ్గంపేట పోలీసులు అప్పగించారు&period; దీంతో గంటల వ్యవధిలో పోగొట్టుకున్న బంగారం తిరిగి దక్కించుకోవడంతో ఆ మహిళ హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.