సినీ నటుడు శోభన్‌బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ..

Shobhan babu

Advertisements

&NewLine;<p>విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్‌ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్‌బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు&period;   తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్‌బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు&period; విగ్రహ నిర్మాణ కమిటీ&comma; విశాఖపట్నం&comma; శోభన్‌బాబు ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ&period;సతీష్‌ కుమార్‌&comma; విగ్రహ దాత జె&period;రామాంజనేయులు &comma; రాశీ మువీస్‌ అధినేత ఎం&period;నరసింహరావు&comma; సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు&comma; అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి అధ్యక్షులు&comma; మాజీ ఎం&period; ల్&period; సి&period; ఎం&period; సుధాకర్ బాబు&comma; అఖిలభారత్ శోభన్ బాబు సేవాసమితి సభ్యులు పూడి శ్రీనివాస్&comma; టి&period; వీరప్రసాద్&comma; భట్టిప్రోలు శ్రీనివాసరావు&comma; ఎస్&period; ఎన్&period; రావు&comma; కె&period; శ్రీనివాసకుమార్&comma; యు&period; విజయ్&comma; టి&period; సాయికామరాజు తదితరులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; తొలుత వీరంతా శోభన్‌బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విగ్రహ ఆవిష్కరణ చేసిన జె&period;రామాంజనేయులతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడుగా శోభన్‌బాబు ఎంతో గుర్తింపు పొందారన్నారు&period; ఆరు అడుగుల అందగాడుగా&comma; కుటుంబ చిత్రాల కధానాయకుడిగా ఎన్నో సినిమాల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగారన్నారు&period; శోభన్ బాబు సినిమాల్లో సమాజానికి అవసరమైన ఎంతో సందేశం ఉండేదన్నారు&period; నాటి తరంతో పాటు నేటి తరం హిరోలకు శోభన్ బాబు ఆదర్శనీయంగా నిలిచారన్నారు&period; భౌతికంగా ఆయన లేక పోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారన్నారు&period; దేశ వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలు ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు&period; ఈ సందర్బంగా దాతలను విగ్రహ నిర్మాణ కమిటీ ఘనంగా సత్కరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..