ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు. ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో నెగ్గిన గొల్లపల్లి నరసింహమూర్తి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా వెంటనే ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేయాలని వారన్నారు. అలాగే పార్టీలో ఉండి ఒంటి పోకడ రాజకీయం చేసిన ఘనత ఒక గొల్లపల్లి బుజ్జికే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ అంటూ స్థానిక అధికారులను బాధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఏలేశ్వరం అభివృద్ధి చెందాలంటే ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడమే శుభ పరిణామం అని అది ఏలేశ్వరం మండల ప్రజలకు అదృష్టమని అన్నారు. అలాగే పార్టీలో భవిష్యత్తు ఇచ్చిన ఎమ్మెల్యే పర్వతపై అవాకులు చవాకులు పెలడం తగదని వారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పై ఆరోపణలను మానుకోవాలని వారు సందర్భంగా హెచ్చరించారు
ఎంపీపీ బుజ్జి రాజీనామా చేయడం శుభ పరిణామం
69