111
సంగారెడ్డి జిల్లా సదాశివపేట MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవ చోటుచేసుకుంది. వేజ్ అగ్రిమెంట్ విషయంలో యూనియన్ అధ్యక్షుడు ఉగ్గేలి రాములు, కార్మికుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది. చివరకు కార్మికులకు, యూనియన్ అధ్యక్షుడి మధ్య ఘర్షణ కు దారితీసింది. ఈ ఘర్షణలో ఉగ్గేలి రాములు తలకు గాయమైంది. గాయపడిన యూనియన్ నాయకుడిని ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ విషయం తెలుసుకుని కార్మికులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అదుపు చేశారు.