యన్ టి ఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, నిడమానూరు.
పవిత్ర రంజాన్ | Ramadan 2024
పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు కు అవమానం. ముస్లిం సోదరులు రంజాన్ రోజున పర్దనలు చేసుకోవడానికి కనీసం పర్దనా మందిరం లో చోటు లేక రోడ్డు పై ముస్లిం మత పెద్దలతో నిడమానూరు మసీదు సెంటర్ వద్ద రోడ్డు పై ప్రార్థనలు. స్థానిక నిడమానూరు రహదారి బ్లాక్ చేసి రహదారిపై ముస్లిం సోదరులు పార్డనలు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ శీలం రంగారావు, వైఎస్ఆర్సిపి నాయకురాలు పరిమి సింధూర, టీడీపీ నాయకులు మాదల నాని బాబు, బండి నాని గ్రామ పార్టీ తెలుగుదేశం నాయకులు తదితరులు.
సర్పంచ్ శీలం రంగారావు(Seelam Ranga Rao) మాట్లాడుతూ…
ఈద్గా స్థలాల కోసం ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాం. గ్రామపంచాయతీలో రెండుసార్లు ఈద్గా స్థలాల కోసం తీర్మానం చేసిన కొన్ని అనివార్య కారణాలవల్ల అంతరాయం కలిగింది. రంజాన్ ప్రార్థనలు ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేయటం సాధ్యపడలేదు. భవిష్యత్తు రోజులలో స్థానిక ఎమ్మెల్యే వల్లనేని వంశీ గారితో చర్చించి అందరికీ అనుకూలమైన ఈద్గా మసీదు స్థలం ఏర్పాటు చేస్తాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఉన్న ఈద్గా మసీదు(Eidgah Masjid) ప్రహరీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే వంశీ 10 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీదు సరిపోకపోవడం వల్ల జనాభా పెరిగి ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది కలిగింది. నూతన మసీదు నిర్మాణానికి గన్నవరం శాసనసభ్యులు వంశీ 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముస్లిం సోదరులకు ఎలాంటి అవసరం వచ్చిన ముందుండి పరిష్కరించే విధంగా వంశి గారి ఆధ్వర్యంలో నేనెప్పుడూ ముందుంటాను.
టీడీపీ నాయకులు మాదల నాని బాబు, బండి నానీ మాట్లాడుతూ…
ముస్లిం సోదరులు ప్రార్థన మందిరం లేకుండా పడుతున్న ఇబ్బందులు గమనించాం. నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు వద్దకు తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాము.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పవిత్ర రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అవమానం…..