ఈ ప్రాంత అభివృద్దే నా ధ్యేయం….

Minister Duddilla Sridhar Babu

Advertisements

&NewLine;<p>మంత్రిగా మొదటిసారి పెద్దపెల్లి జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు&comma; ప్రజలు ఘన స్వాగతం పలికారు&period; సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం పెద్దపల్లికి ర్యాలీగా బయలుదేరారు&period; పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని&comma; రామగుండం&comma; పెద్దపల్లి&comma; ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని&comma; ఈప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు&period; ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని&comma; మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని&comma; రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు&period; పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని&comma; ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని&comma; ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీధర్ బాబు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.