మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‍రావు కన్నుమూత..

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కాసేపటి క్రితం కన్నుమూశారు&period; గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు&period; ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు&comma; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాటు&comma; మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; రాజకీయ&comma; సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు&period; నాదెండ్ల భాస్కరరావు 1935&comma; జూన్ 23à°¨ జన్మించారు&period; 1958లో ఆయన లలిత భాస్కరరావును వివాహం చేసుకోగా&comma; వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు&period; ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఏపీ మంత్రిగా కొనసాగుతుండగా&period;&period; మరో కుమారుడు వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు&period; భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ&comma; ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు&period; 1978 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; 1978 నుంచి 1982 వరకు నాదెండ్ల భాస్కరరావు&period;&period; మర్రి చెన్నారెడ్డి&comma; టి&period;అంజయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు&period; తర్వాతి పరిణామాలతో టీడీపీలో చేరిన నాదెండ్ల భాస్కర్ రావు&comma; ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు&period; 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు&period;ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు&comma; ఆహారం&comma; వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.