తెరుచుకున్న కేదార్‍నాథ్ ఆలయం..

Advertisements

<p>ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత&comma; ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి&period; వేద మంత్రోచ్ఛారణలు&comma; శంఖారావాల మధ్య బాబా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది&period; ఈ మేరకు ఆలయాన్ని దాదాపు 51 క్వింటాళ్ల వివిధ రకాల స్వదేశీ&comma; విదేశీ పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు&period; ఆలయ ద్వారాలు తెరుచుకున్న సమయంలో వేలాది మంది భక్తులు చేసిన &OpenCurlyQuote;హరహర మహాదేవ్’&comma; &OpenCurlyQuote;జై కేదార్’ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగిపోయాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది&period; కేదార్‌నాథ్‌తో పాటు బద్రీనాథ్&comma; గంగోత్రి&comma; యమునోత్రి దర్శనం కోసం ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు&period; భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది&period; ముఖ్యంగా కేదార్‌నాథ్ మార్గంలో ఇంకా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంది&period; అలాగే యమునోత్రి&comma; గంగోత్రి ధామ్‌à°² దర్శనం కూడా ప్రారంభమవడంతో ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర సందడి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.