నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.

Advertisements

<p>నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది&period; టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది&period; ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది&period; కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు&comma; అనామక టెలిగ్రామ్ ఛానెళ్లు&period;&period; అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది&period; ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించింది NTA&period;<&sol;p>&NewLine;<p>ఈ మోసాలతో పాటు&comma; పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్‌లోడ్ చేసి&comma; మెసేజ్‌ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లు అధికారులు గమనించారు&period; ఈ &&num;8216&semi;మెసేజ్ ఎడిటింగ్&&num;8217&semi; ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి&comma; జూన్ 30 వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లు తెలుస్తుంది&period; సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ&comma; పరీక్షల పారదర్శకతను కాపాడటానికి&comma; అభ్యర్థులు తప్పుడు పుకార్ల బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం అనివార్యమైందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..