మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్.

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్

Advertisements

<p>ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది&period; ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థతో జరుగుతున్న కాపీరైట్ వివాదంలో కీలక తీర్పునిచ్చింది&period; గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది&period; ఇళయరాజా తాను సృష్టించిన ట్యూన్లపై మాత్రమే కాపీరైట్ హక్కులను కలిగి ఉంటారని&comma; సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగ్స్‌పై ఆయనకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది&period; కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 14&lpar;A&rpar; ప్రకారం కేవలం సాహిత్యం మినహాయించిన ట్యూన్స్ వరకే ఇళయరాజాకు హక్కులు ఉంటాయని&period;&period; సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగులను ఆయన సొంతంగా వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది&period; దీంతో134 సినిమాల్లోని పాటలపై ఇళయరాజాకు ప్రస్తుతానికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టమైంది&period;<&sol;p>&NewLine;<p>1976 నుంచి 2001 మధ్య కాలంలో విడుదలైన పలు చిత్రాల నిర్మాతలతో తాము అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నామని సరిగమ పేర్కొంది&period; ఈ ఒప్పందాల ప్రకారం ఆయా సినిమాల్లోని పాటల పూర్తి సౌండ్ రికార్డింగ్స్&comma; సంగీతం&comma; సాహిత్య పరమైన కాపీరైట్ హక్కులు చట్టబద్ధంగా తమకే సొంతమని ఆ సంస్థ వాదిస్తోంది&period; అయితే సరిగమ సంస్థకు హక్కులున్న ఈ 134 సినిమాల పాటలను ఇళయరాజా తన సొంత ఆస్తులుగా పేర్కొంటూ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేశారు&period; దీంతో సరిగమ సంస్థ కోర్టును ఆశ్రయించింది&period; దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు&period;&period; పూర్తి సౌండ్ రికార్డింగ్‌పై ఇళయ రాజాకు హక్కులు ఉండవని తీర్పునిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.