హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు

Advertisements

<p>రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి&period; భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period;వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది&period; దీంతో ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్ నుంచి నర్సింగ్‌పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది&period; వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి&period;<&sol;p>&NewLine;<p>హైవే దెబ్బతిన్న వెంటనే జిల్లా యంత్రాంగం&comma; ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు&period; ఘటనకు సంబంధించిన వీడియోలు&comma; రహదారి కుంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period;గురుగ్రామ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయాయి&period; ఒకచోట గుంతలో ఎస్‌యూవీ వాహనం ముందు చక్రాలు ఇరుక్కుపోగా&comma; జిల్లా కలెక్టర్ నివాసం&comma; రాష్ట్ర మంత్రి నివాసం సమీపంలో కూడా రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కార్లు&comma; బస్సులు&comma; లారీలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది&period; పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు&period;పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు&period; ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్‌హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని నివారించాలని&comma; రాజీవ్ చౌక్&comma; సదర్న్ పెరిఫెరల్ రోడ్&comma; హీరో హోండా చౌక్&comma; ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు&period; దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు కొనసాగుతున్నాయని&comma; ప్రజలు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.