నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్

Advertisements

<p>సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19à°µ రోజుకు చేరుకుంది&period; ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది&period; అలాగే ప్రభుత్వ వైద్యులతో రోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది&period; విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు&period; ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు&comma; ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదేనని&period;&period;ఆయన ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన వైద్యం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>59 ఏళ్ల సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఇప్పటికే 8&period;5 కిలోల బరువు తగ్గారని పిటిషన్‌లో పేర్కొన్నారు&period; ఆయన మరో 48 గంటలు నిరాహార దీక్ష కొనసాగిస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి&comma; అవసరమైతే ద్రవరూపంలో పోషకాహారం&comma; విటమిన్లు&comma; ఖనిజాలు అందించాలని పిటిషన్‌లో కోరారు&period; విచారణ సందర్భంగా వాంగ్‌చుక్‌ ఆరోగ్యాన్ని ప్రభుత్వ వైద్యులు ఎందుకు పర్యవేక్షించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది&period; రోజూ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని&comma; అయితే కొన్ని సందర్భాల్లో ప్రైవేట్‌ వైద్యులు కూడా పరీక్షిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా తెలిపారు&period; దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇకపై ప్రభుత్వ వైద్యులతోనే రోజువారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది&period; అవసరమైతే వెంటనే చికిత్స అందించాలని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.