ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నాటకీయ పరిణామం.

Advertisements

<p>దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది&period; శాంతియుతంగా సాగుతున్న ఆందోళనల మధ్య కొందరు అల్లరిమూకలు రెచ్చిపోవడంతో హింస చెలరేగింది&period; విధుల్లో ఉన్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఉన్నట్టుండి రాళ్లదాడికి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటిపోయింది&period; ఈ ఆకస్మిక దాడిలో ఇద్దరు ఏసీపీలతో పాటు ఇద్దరు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు&period; ఈ మేరకు వారిని తోటి సిబ్బంది చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు&period; అల్లరిమూకల రాళ్ల దాడితో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు&period; అయితే&comma; రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా&comma; సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు అధికారులు కఠిన చర్యలకు దిగారు&period; జంతర్ మంతర్‌ పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు&period; ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల&comma; భద్రతా బలగాల అదుపులో ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.