భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

Advertisements

<p>మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది&period; వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది&period; అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది&period; ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది&period; ఈ ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది&period; గత 2003లో కుదిరిన ASI ఒప్పందం ప్రకారం&period;&period; ఈ ప్రాంగణంలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేయడానికి&comma; ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది&period; అయితే ఈ ప్రాంగణంపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని ప్రత్యేక పూజా హక్కులు ఇవ్వాలని హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ స్థలం తమదంటే తమదే అంటూ ఇండోర్ హైకోర్టును ఇరువర్గాలు ఆశ్రయించాయి&period; దీంతో ఇక్కడ శాస్త్రీయ సర్వే జరగాలని కోర్టు ఆదేశించింది&period; కోర్టు ఆదేశాలతో 2024లో 98 రోజుల పాటు పురావస్తు శాఖ సర్వే &lpar;ASI &rpar; నిర్వహించింది&period; అనంతరం 2 వేల పేజీలకుపైగా ఉన్న నివేదికను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించింది&period; మసీదు నిర్మాణం కంటే ముందే అక్కడ భారీ ఆలయం ఉన్నట్లుగా ఆ ప్రాంతంలో లభించిన పలు శిల్పాలు&comma; స్తంభాల శిథిలాలు&comma; శాసనాలు తెలియజేస్తున్నాయన్నారు&period; ఇవి పర్మార్‌ రాజవంశం కాలానికి చెందినవని ఈ సర్వే స్పష్టం చేసింది&period; ఈ సర్వేలో లభించిన పురాతన నాణేలు&comma; శిల్పాలు&comma; సంస్కృత శాసనాలు ఈ ప్రాంగణం ఒకప్పుడు దేవాలయమే అనడానికి బలమైన సాక్ష్యాలని హిందూ పక్షం వాదించగా ASI నివేదిక ఏకపక్షంగా ఉందంటూ ముస్లిం పక్షం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది&period; అయితే చరిత్ర&comma; శాస్త్రీయ ఆధారాలు&comma; చట్టపరమైన నిబంధనలను పరిశీలించిన కోర్టు&period;&period; మే 12à°¨ తీర్పును రిజర్వ్ చేసింది&period; ఇవాళ తుది తీర్పును ప్రకటించింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..