యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం

Advertisements

<p>తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు&period; ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో&period;&period; మంత్రులు&comma; జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; మే నెల చివరి నాటికి రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు&period; క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు&period; ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు&period; రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఐకేపీ కేంద్రం&comma; రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక పర్యవేక్షక అధికారిని నియమించారు&period; తరుగు&comma; తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు&period; అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా తగినన్ని తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని&comma; లారీల కొరత ఉంటే స్థానిక ట్రాక్టర్లను ఉపయోగించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు&period; ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు మంత్రులు&comma; ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు&period; మరిన్ని తాజా అప్‌డేట్స్‌ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..