చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం

Advertisements

<p>దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ&period; ఎప్పుడూ వినూత్న పథకాలు&comma; సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం&period;&period; ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది&period; దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది&period; వృద్ధాప్యంలో తోడు లేక&comma; సరైన సంరక్షణ కరువై అల్లాడుతున్న వృద్ధులకు అండగా నిలబడడమే లక్ష్యంగా ఈ కొత్త విభాగాన్ని తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటివరకు మహిళలు&comma; శిశు సంక్షేమ శాఖ పరిధిలోనే వృద్ధుల వ్యవహారాలు కూడా ఉండేవి&period; కానీ&comma; కేరళలో మారుతున్న జనాభా సమీకరణాలు&comma; పెరుగుతున్న వృద్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధి నుంచి దీనిని వేరు చేశారు&period; వృద్ధుల కోసం ఒక స్వతంత్ర విభాగాన్ని ఏర్పాటు చేశారు&period; ఈ ప్రత్యేక శాఖ ద్వారా వృద్ధులకు సంక్షేమ పథకాలను అందించనున్నారు&period; ఇందులో భాగంగా వృద్ధుల ఆరోగ్యం&comma; జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;<p>వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి ఉచిత వైద్యం&comma; ఇంటి వద్దకే మందుల సరఫరా&comma; మానసిక ఉల్లాసం కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు&period;ఒంటరిగా ఉంటున్న వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు&comma; సైబర్ నేరాల నుండి వారిని రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు&period; రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో కనీస వసతులు&comma; వైద్య సదుపాయాలు సక్రమంగా ఉండేలా ఈ శాఖ నేరుగా పర్యవేక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>రాబోయే రోజుల్లో కేరళలో వృద్ధుల జనాభా మరింత పెరిగే అవకాశం ఉందన్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ ముందస్తు అడుగు వేసింది&period; వయసు పైబడిన వారు సమాజానికి భారం కాదు&comma; వారు మన బాధ్యత అని చాటిచెప్పిన కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి&period; మిగతా రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..