భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ

Advertisements

<p>భారత్‌-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది&period; భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు&comma; &&num;8216&semi;M777&&num;8217&semi; ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు&comma; రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది&period; ఇండో-పసిఫిక్&comma; దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం&comma; శాంతికి ప్రధాన భాగస్వామిగా ఉన్న భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ డీల్ దోహదపడుతుందని అమెరికా పేర్కొంది&period; ఇందులో భాగంగా AH-64E అపాచీ హెలికాప్టర్ల దీర్ఘకాలిక నిర్వహణ&comma; లాజిస్టిక్స్ సేవల కోసం 198&period;2 మిలియన్ డాలర్లను కేటాయించగా&comma; దీనికి బోయింగ్&comma; లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయి&period;<br &sol;>&NewLine;మరోవైపు సరిహద్దుల్లో అత్యంత కీలకమైన &&num;8216&semi;M777A2&&num;8217&semi; హోవిట్జర్ ఫిరంగుల విడిభాగాలు&comma; మరమ్మతులు&comma; సాంకేతిక సహాయం&comma; శిక్షణ కొరకు 230 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది&period; దీనికి BAE సిస్టమ్స్ కాంట్రాక్టర్‌గా ఉంటుంది&period; ఈ అత్యాధునిక సేవలు&comma; పరికరాలను తమ సాయుధ దళాల్లో విలీనం చేసుకోవడం భారతదేశానికి చాలా సులువైన విషయమని అమెరికా ప్రశంసించింది&period; ఈ మెగా రక్షణ ఒప్పందం ద్వారా భారత్ ప్రస్తుత&comma; భవిష్యత్ ప్రాంతీయ ముప్పులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొని&comma; తన దేశీయ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోగలదని వైట్ హౌస్ స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.