బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్

Advertisements

<p>భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ&period;&period; ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించే ఎలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయడం&comma;దిగుమతి చేసుకోవడం&comma; వినియోగించడం అనుమతించబోదని స్పష్టం చేసింది&period; ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోటీసు విడుదల చేసింది&period;<br &sol;>&NewLine;డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 ప్రకారం కాస్మెటిక్స్ అంటే శరీరాన్ని శుభ్రపరచడం&comma;అందంగా చూపించడం&comma;ఆకర్షణ పెంచడం లేదా రూపాన్ని మార్చేందుకు బయటకు రాసుకునే ఉత్పత్తులేనని డీసీజీఐ పేర్కొంది&period;<br &sol;>&NewLine;అయితే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఉత్పత్తులు కాస్మెటిక్స్ నిర్వచనంలోకి రావని తెలిపింది&period; అందువల్ల బ్యూటీ క్లినిక్స్&comma; ప్రొఫెషనల్స్ లేదా వినియోగదారులు కాస్మెటిక్ ఉత్పత్తులను ఇంజెక్షన్ల రూపంలో ఉపయోగించరాదని హెచ్చరించింది&period; కాస్మెటిక్ ఉత్పత్తులను శరీరంపై రాసుకోవడం&comma; చల్లడం లేదా స్ప్రే చేయడానికే అనుమతి ఉంటుందని&comma; చికిత్స కోసం లేదా ఇంజెక్షన్ ద్వారా ఉపయోగించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది&period; అలాగే నిషేధిత పదార్థాలను ఉపయోగించడం&comma; తప్పుడు ప్రచారం చేయడం&comma; లేబుళ్లపై తప్పుదారి పట్టించే వివరాలు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది&period; తయారీదారులు ఉత్పత్తులపై ఇచ్చిన వివరాలను ఎవరూ మార్చకూడదని డీసీజీఐ ఆదేశించింది&period; కాస్మెటిక్ ఉత్పత్తులు వైద్య చికిత్సలకు ఉపయోగపడతాయని చెప్పడం లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం పై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..