జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..

Advertisements

<p>జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలు&comma; దేశ వ్యతిరేక శక్తుల నెట్‌వర్క్‌లను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి ఉక్కుపాదం మోపింది&period; కశ్మీర్ లోయలోని శ్రీనగర్&comma; షోపియన్ జిల్లాల్లోని మూడు అత్యంత కీలక ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు&period; గత నెలలోనే ఉగ్ర లింకులు&comma; తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనల కారణంగా యూఏపీఏ చట్టం కింద అక్రమ సంస్థగా ప్రకటించబడిన షోపియన్ జిల్లా ఇమామ్ సాహిబ్ ప్రాంతంలోని దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్&&num;8217&semi; సంస్థలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు&period; దీనితో పాటు&comma; గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ మాజీ చీఫ్ షహ్జాదా ఔరంగజేబ్ నివాసంలోనూ ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి&period; అటు శ్రీనగర్‌లోని లాల్ బజార్ పరిధిలో ఉన్న బాలికల మతపర విద్యాసంస్థ &&num;8216&semi;జామియత్ ఉల్ బనాత్&&num;8217&semi; కూడా ఈ దాడుల పరిధిలోకి వచ్చింది&period; జమ్మూ కాశ్మీర్ పోలీస్&comma; సీఆర్‌పీఎఫ్ బలగాల గట్టి భద్రత నడుమ జరుగుతున్న ఈ సోదాల్లో&period;&period; టెర్రర్ ఫండింగ్&comma; కశ్మీర్‌లో అశాంతి రేపేందుకు జరుగుతున్న కుట్రలకు సంబంధించిన కీలక పత్రాలు&comma; ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా ఎన్‌ఐఏ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.